23 June, 2026 | 2:32 AM

వానాకాలంపై అప్రమత్తత

23-06-2026 01:06 AM
  1. పెద్దపల్లి లో రైతులకు ఇబ్బందులు కలగకూడదు 
  2. అధికారులతో సమీక్ష సమావేశం లో ప్రభుత్వ విప్ విజయరమణ రావు

పెద్దపల్లి, జూన్ 22(విజయ క్రాంతి) ఈ వానాకాలం సీజన్ను పురస్కరించుకుని రైతులు, వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయరమణ రావు  ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖాధికారులు, జిల్లా సహకార అధికారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులతో ఆయన ముందస్తు సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే అధికారులకు దిశా నిర్దేశం చేశారు వర్షాకాలం ప్రారంభమవుతున్న వేళ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

విద్యుత్ శాఖకు దిశానిర్దేశం: వానాకాలంలో ఈదురు గాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ని యోజకవర్గంలో కొత్త విద్యుత్ సబ్-స్టేషన్ల ఆవశ్యకతను గుర్తించి, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు.పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను సురక్షితమైన ప్రదేశాలకు తక్షణమే మార్చాలని ఆదేశించారు.వ్యవసాయం - సహకార రంగంపై ప్రత్యేక దృష్టి ఎరువులు, విత్తనాల సరఫరా  రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ఎప్పటికప్పుడు స్టాక్ అందుబాటులో ఉంచాలని, రైతులకు పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని కోరారు.