ప్రభుత్వ స్కూల్‌ల మూసివేతను సహించం
ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి ఏబీవీపీ
నల్లగొండ టౌన్, జూన్ 22: రేషనలైజేషన్ పేరిట రాష్ట్రములో 24 వేల పాఠశాలను ముసి వేతను నిరసిస్తూ డి ఈ ఓ కార్యాలయంవద్దఏబీవీపీ సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కొంపల్లి సూర్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల మూసవేతని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలల మూసివేత పేదలను విద్యకు దూరం చేయడమే అన్నారు.
ప్రవేట్ కార్పొరేట్ పాఠశాలలో అధికంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను తీవ్ర మనోవేదన గురిచేస్తున్నారని, ఖాళీగా ఉన్న ఎంఈఓ డీఈవో పోస్టులను, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టలను వెంటనే భర్తీ చేయాలి, గురుకుల పాఠశాలకు పక్కా భవనాలు నిర్మించాలని, ప్రవేటు కార్పోరేట్ పాఠశాలలో 25% సీట్లను పేద విద్యార్థుల కేటాయించాలని,విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్, రాష్ట్ర యూనివర్సిటీస్ కో కన్వీనర్, మౌనేష్, హాస్టల్స్ కో కన్వీనర్ సంపత్, గోపీచంద్, రాష్ట్ర ఫార్మవిజన్ కో కన్వీనర్ శివ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శంకర్, మోహన్, విద్యార్థి నాయకులు కార్తీక్, సతీష్, వరుణ్, లోకేష్, లక్ష్మినివాస్, చరణ్, శివరామరాజు, తదితరులు పాల్గొన్నారు.






