తరలిన పోలింగ్ సామగ్రి
13-05-2024 01:16 AM
జగిత్యాల, మే 12 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలో ఓటర్లు శాంతి యుతవాతావరణంలో ప్రశాంతంగా ఓటు వేసేలా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జగిత్యాల మినీ స్టేడియం, ధర్మపురి ప్రభుత్వం జూనియర్ కళాశాల, కోరుట్ల ఎస్‌ఎఫ్‌ఎస్ హైస్కూల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 295 వాహనాల్లో సిబ్బందిని తరలించారు. జిల్లాలో ఎన్నికల విధుల్లో 1,104 మంది పోలింగ్ అధికారులు, 1,104 సహాయ పోలింగ్ అధికారులు, 2,208 మంది ఇతర సిబ్బంది, 116 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పర్యవేక్షణలో ప్రక్రియ పూర్తయ్యింది. ఓటర్లు ప్రశాంతంగా ఓటేశాలా జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో బందో బస్తు ఏర్పాటు చేశారు.




