10-12-2025 08:27:35 PM
ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి..
జగిత్యాల డీఎస్పీ రఘు చందర్..
ధర్మపురి (విజయక్రాంతి): ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయితీ ఎన్నికలపై వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు కోరుట్ల నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తుండగా జగిత్యాల నియోజకవర్గంలో రెండవ విడత, ధర్మపురిలో మూడవ విడత ఎన్నికలు జరగనున్నాయన్నారు.
ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల భధ్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని, గ్రామాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్, చెక్ పోస్ట్లు, ఏర్పాటు చేశామని, ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎటువంటి అల్లర్లకు గొడవలకు పాల్పడకుండా తమ గ్రామ సర్పంచులను గెలిపించుకోవాలని పోలీస్ శాఖ తరుపున విజ్ఞప్తి చేశారు. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ప్రచారం నిర్వహించుకోవాలని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయవద్దని పోలీస్ శాఖ తరుపున ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్ కుమార్ లు పాల్గొన్నారు.