calender_icon.png 11 December, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వాలు చట్టాలను నీతివంతంగా, జాప్యం లేకుండా అమలు చేయాలి

10-12-2025 08:30:48 PM

రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్..

హనుమకొండ (విజయక్రాంతి): ధనిక, బీదల మధ్యన తారతమ్య భేదం లేకుండా చూడాలని, చట్టాలు సక్రమంగా నీతివంతంగా, జాప్యం లేకుండా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. బుధవారం జాతీయ మానవ హక్కుల సమైక్య ఎన్జీవో అంతర్జాతీయ దినోత్సవం కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్లో జాతీయ ఎన్ హెచ్ ఆర్ సి చైర్మన్ అలినేని శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలియజేయాలని, ప్రశ్నించే మనస్తత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు.

2014 తర్వాత దేశంలో, రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు విచ్చలవిడిగా పరిశ్రమలు నెలకొల్పారని, తద్వారా పర్యావరణాన్ని నాశనం చేయకుండా కాపాడుకోవాలన్నారు. మాజీ జాతీయ సమాచార హక్కు కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం వారి విగ్రహాన్ని వరంగల్లో పెడతామని, వారి ఆశయాల కొనసాగింపు కొరకు వరంగల్ గొర్రెకుంటలో వృద్ధాశ్రమంలో ఉచిత మెడికల్ సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్ హెచ్ ఆర్ సి జాతీయ చైర్మన్ ఐలినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో ఉన్న నిజాయితీ గల, నిర్భయంగా మాట్లాడగలిగే పౌరులందరూ ఈ సంస్థ ద్వారా మానవ సేవలు, నిరుపేదల యొక్క సమస్యలు పరిష్కార దిశలో  పని చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి కె.పట్టాభి రామారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ టి.సుబ్బారావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నక్క గంగారం, ప్రధాన కార్యదర్శి వీరేంద్ర యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ చందా మల్లయ్య, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు బాబు యాదవ్, చీఫ్ అడ్వైజర్ డి. రాజేశ్వరరావు, సీనియర్ అడ్వకేట్ మంగళంపల్లి సదా శివుడు, ఎంజీఎం డాక్టరు సనత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పి. రోహిణి, జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, డాక్టర్ బామిరెడ్డి, నరసింహ, తిరుపతి జిల్లా నుండి నరసింహ, రాజు హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు తులసి కళ్యాణి, పద్మ మహిపాల్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డేగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.