11-12-2025 04:18:46 PM
కొండాపూర్ గురుకులం ప్రిన్సిపల్ రాజారం
ధన్వాడ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో చేరేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నదని కొండాపూర్ గిరిజన బాలుర గురుకులం ప్రిన్సిపల్ ఎం.రాజారాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న ఎస్టీ, బీసీ, ఎస్సీ విద్యార్థులు ఐదో తరగతిలో చేరేందుకు అర్హులని తెలిపారు. ఈనెల 11 నుండి 21 వరకు 100 రూపాయల రుసుం చెల్లించి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు tgtwgurukulam.telangana.gov.in వెబ్సైట్ సందర్శించాలని పేర్కొన్నారు.