10-12-2025 08:25:05 PM
విద్యార్థులకు అవగాహన కలిగించిన కిండ్రల్ సంస్థ..
మేడిపల్లి (విజయక్రాంతి): నేటి ఆధునిక యుగంలో సాంకేతిక విప్లవం రావడంతో అనేక పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ లాంటి ఉత్పత్తులను తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కిండ్రల్ సంస్థ పిలుపునిచ్చింది. పీఎం శ్రీ జడ్పిహెచ్ఎస్ మేడిపల్లి పాఠశాలలో గెజిటడ్ ప్రధానోపాధ్యాయులు ఎల్ సత్యప్రసాద్ అధ్యక్షతన పాఠశాల విద్యార్థులకు కిండ్రల్ సంస్థ వారు అనేక విషయాల పట్ల అవగాహన కల్పించారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా కిండ్రల్ కంపెనీ మేడిపల్లి జడ్పిహెచ్ఎస్ విద్యార్థులకు బయోడిగ్రేడబుల్ రీయూజబుల్ శానిటరీ ప్యాడ్లు, జ్యూట్ బ్యాగులను పంపిణీ చేసింది. ఈ ఉత్పత్తులను పర్యావరణహిత, స్థిరమైన ప్రత్యామ్నాయాలను తయారు చేసే మహిళల ఆధ్వర్యంలోని సంస్థ 'స్త్రీయ' రూపొందించింది. ఈ కార్యక్రమం ద్వారా మెనుయల్ హైజీన్ పై అవగాహన పెంపొందించడం, బాలికలకు పునర్వినియోగించుకునే స్థిరమైన ఉత్పత్తులను అందించడం, అలాగే పర్యావరణం పట్ల బాధ్యతాయుతమైన ఆచరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, కిండ్రల్ సంస్థ బృందం, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.