21-11-2025 12:00:00 AM
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
వనపర్తి టౌన్, నవంబర్ 20 : గామపంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేం దుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రాణి కుముదిని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓట ర్ జాబితా తయారీపై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్ లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ గిరిధర్ రావుల, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడితే, సజావుగా ఎన్నికలు జరిగేలా జిల్లా యం త్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
విడతల వారీగా పంచాయతీ ఎన్నికల నిర్వహించాలనుకుంటే, ఎన్ని ఫేస్ లు, ఏ ఫేజ్‌లో ఏ మండలాల్లో ఎన్నికలు జరగాలో జిల్లా వారీగా ప్రణాళిక అందించాలని అన్నారు. సెప్టెంబర్ 2న విడుదల చేసిన పంచాయతీ తుది ఓటర్ జాబితా సంబంధించి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించి నవంబర్ 22 లోపు పరిష్కరించాలని అన్నారు. నవంబర్ 23న ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి పోలింగ్ కేంద్రా లు, ఫోటోలతో కూడిన ఓటర్ జాబితా ప్రచురణ పూర్తి కావాలని అన్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎంసిసి నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు. ఎంసిసి ఉల్లంఘన పై వచ్చే ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి యంత్రాంగం సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలోఏ ఎస్పి వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డిపిఓ తరుణ్ చక్రవర్తి, డిఎల్పిఓ రఘునాథ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.