calender_icon.png 21 November, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్డియాక్ కేర్‌లో మరో ముందడుగు

21-11-2025 12:00:00 AM

శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్‌లో దేశంలోనే తొలి అమ్వియా ‘ఎడ్జ్ సీఆర్‌టీపీ క్యూపీ’

హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): భారతీయ కార్డియాక్ రంగంలో శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ మరో కీలక మైలురాయిని సాధించింది. దేశంలోనే తొలిసా రిగా అత్యాధునిక అమ్వియా ఎడ్జ్ సీఆర్‌టీపీ క్యూపీ కార్డియాక్ రిథమ్ పేసింగ్ డివైస్‌ను ఇంప్లాంట్ చేశారు. ఈ పరికరంలో ఉన్న ఆటో-ఎంఆర్‌ఐ సాంకేతికత, ఫిజియోలాజికల్ పేసింగ్ పరంగా అభివృద్ధి సాధించింది.

ఈ ఇంప్లాంటేషన్‌ను శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ చైర్మన్, చీఫ్ కార్డియాలజిస్టు, ఎలెక్ట్రో ఫిజియాలజిస్టు ప్రొఫెసర్ డా. వి.ఎస్. రామచంద్ర, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియా ల జిస్ట్స్ డా. శ్రవణ్ పెరవాలి, డా. నీలేశ్ చైతన్యరెడ్డి ఎన్లు, అనుభవజ్ఞులైన కార్డియాక్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆటో-ఎంఆర్‌ఐ టెక్నాలజీ సహాయంతో ఎటు వంటి ప్రత్యేక ప్రోగ్రామింగ్ అవసరం లేకుండా 24/7 ఎంఆర్‌ఐ సేఫ్టీ కల్పిస్తోంది.

దీని వల్ల హృదయ సంబంధిత డివైస్పు ఆధారపడే రోగులకు మరింత సౌకర్యం లభిస్తుంది. లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ ఏరియా పేసింగ్ లాంటి ఆధునిక ఫిజియోలాజికల్ పేసింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఈ విధంగా ప్రకృతిసిద్ధమైన హృదయ రిథమ్‌ను పునరుద్ధరించడంపై దృష్టి సారించింది. యాం త్రిక అభివృద్ధి చెం దిన అల్గారిథమ్స్ ద్వారా అరిత్మియా (హృదయ స్పందనలో అసమతుల్యత) తగ్గించి, చికిత్స ఫలితాలు మెరు గుపడేలా తోడ్పడుతుంది.

ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. ‘ఆటో-ఎంఆర్‌ఐ ఉన్నత సదుపాయంతో రోగులకు వ్యక్తిగత, సురక్షిత కార్డియాక్ థెరపీ అందించగలగడం వారికి దీర్ఘకాలం ఉపయో గపడుతుంది. ఇది రోగులకు మరింత సౌకర్యాన్ని, డాక్టర్లకు క్లినికల్ కారూత్యాన్ని ఇస్తుంది‘ అని వివరించారు.