calender_icon.png 14 August, 2025 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి

13-08-2025 07:09:08 PM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..

కరీంనగర్ (విజయక్రాంతి): రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) ఆదేశించారు. భారీ వర్షాలు, తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో పాటు సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో ఫీల్డ్ లో ఉండాలని కలెక్టర్ తెలిపారు.

కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్  పమేలా  సత్పతి తెలిపారు.భారీ వర్షాల నేపథ్యంలో సహాయం కోసం 0878 2997247 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని తెలిపారు. కంట్రోల్ రూమ్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు తమ తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.