13-08-2025 07:06:22 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెలువర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు(District Collector Hanumantha Rao) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. బేస్మెంట్ పూర్తి అయిన వెంటనే లబ్ధిదారుల ఫోటోలు అప్ లోడ్ చేయాలని త్వరగా బిల్లులు లబ్ధిదారులకు అందేలా చూడాలని అన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేందర్, తదితరులు పాల్గొన్నారు.