15 April, 2026 | 11:08 AM

అందరి చూపు డీసీసీ పీఠం పైనే!

13-05-2025 12:01 AM
  1. కొత్త అధ్యక్షుడు నియామకం ఎప్పుడో 
  2. త్వరలోనే త్వరలోనే అంటూ వస్తున్న అధిష్థానం 
  3. రాష్ట్ర నేతలతో ఎవరి ప్రయత్నాల్లో వారు  
  4. పంచాయతీ ఎన్నికల్లోపే కొత్త డీసీసీ అధ్యక్షులు..?

మహబూబ్ నగర్ మే 12 (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ ప్రస్తుతం ఊపు మీద ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయతీరాలకు చేరి విజయాన్ని సొంతం చేసు కున్న విషయం విధితమే. కాంగ్రెస్ పార్టీ జి ల్లా అధ్యక్షులుగా ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చు రుగ్గా పాల్గొంటూనే ఎమ్మెల్యేగా దేవరకద్ర నియోజకవర్గంలో అలుపెరగకుండా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశ నెల అవుతుంది కార్యకర్తలకు నాయకులకు అందుబా టులో ఉంటున్నారు.

మహబూబ్ నగర్ ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వారిని నియోజకవర్గంలో ప్రత్యేకంగా సమయం కేటాయి స్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు.

ఇదిలా ఉండగా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు..? నూ తన బాధ్యతలు ఎవరు చేపడతారని ప్రశ్న మూడు నియోజకవర్గాల్లో నెలకొంది. గత కొంతకాలంగా ఈ ప్రశ్నకు సమాధానం దొ రకని ప్రశ్నగా మిగిలిపోతుంది. సమాధానం చెప్పాల్సిన అధిష్టానం అప్పుడు ఇప్పుడు అంటూ కాలయాపన చేయడంతో ఆశావాల్లో అసంతృప్తి వ్యక్తమయ అవకాశాలు కూడా ఉన్నాయి. 

రెండేళ్లు గడుస్తున్నా... కొత్త అధ్యక్షుడు జాడలేదు...

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏ ర్పాటు చేసినప్పటికీ ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల విషయంలో కొంత వెనుక ఉన్నట్లు భావించాల్సి వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు గడుస్తున్న ఇప్పటివరకు నూతన డిసిసి అధ్యక్షుల కేటాయింపు విషయంలో కొంత ఆలస్యం కావడంతో ఆశవా హులు కూడా ఆ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బహిరంగంగా వారు చెప్పకపోయినప్పటికీ అంతర్లీనంగా ఇంకెప్పుడూ ప్రసాదిస్తా రు..? అనే రీతిగా ఆయా జిల్లాల అధ్యక్షుల బరిలో ఉన్న నేతలు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికైనా రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం జిల్లాల అధ్యక్షులు ప్రక్రియను పూర్తిచేస్తే పార్టీ క్యాడర్ బాగుంటుం దని కార్యకర్తలు ప్రత్యేకంగా చెబుతున్నారు.

అందర్నీ కలుపుకుపోయే నేతకు అవకాశం..? 

 రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లా అ ధ్యక్షులు మాకు కేటాయించాలని కోరుతూ ప్రజల సంఖ్యలో దరఖాస్తు పోయినప్పటికీ పోటీలో ముగ్గురే ఉన్నట్లు తెలుస్తుంది. దీం తో ఎవరికి వరిస్తుందో ? ఎప్పుడు వస్తుందో ? తెలియని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో మరింత వేగంగా ముందుకు సాగితేనే సత్ఫలితాలు ఉంటాయ ని ఆశవాలు ఆశపడుతున్నారు.

జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిప ల్ ఎన్నికలు కూడా జరగనుండడంతో ముం దస్తుగా ఈ ప్రక్రియను ముగింపు పలికితేనే మేలు జరుగుతుందని పలువురు నేతలు పే ర్కొంటున్నారు.

ముగ్గురు ఎమ్మెల్యేలను కలుపుకుపోతూ పార్టీకి కొత్త జోష్ తీసుకువస్తూ ముందుకు తీసుకుపోయే నాయకుడు కో సం కాంగ్రెస్ అధిష్టానం అన్వేషిస్తున్నట్లు తె లుస్తుంది. ఇప్పటికైనా తెర దింపి అధ్యక్షుడు పీఠం ఎవరికి వరిస్తుందో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.