calender_icon.png 13 May, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేయండి

13-05-2025 12:02:09 AM

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం మే 12 (విజయ క్రాంతి) తెలంగాణ రాష్ట్రంలోని అగ్రి గోల్ సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ సంస్థ బాధితులకు -న్యాయం చే యాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు య ర్రా బాబు డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ అగ్రి గోల్ బాధితుల సంఘం ఆ ధ్వర్యంలో ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్బంగా యర్రా బాబు మా ట్లాడుతూ అగ్రి గోల్ కంపెనీ 1996లో ప్రా రంభించబడిందని కంపెనీలో డిపాజిట్లు చేస్తే ఎక్కువ లాభాలు ఉంటాయని -నమ్మిం చి డిపాజిట్ల సేకరణ పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు రూ.5వేల కోట్లు వసూలు చేశారని ఆ డబ్బుతో స్థలాలు, భూములు కొనుగోలు చేయడంతో పాటు రిసారట్స్ నిర్మించారని బాబు తెలిపారు. 

వినతి పత్రం సమర్పించిన వారిలో బాధితుల సంఘం రాష్ట్ర కార్య దర్శి గోగుల వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, బాధితులు రాయల -నాగేశ్వరరావు, ఎం. వెంకటేశ్వర్లు, మైలవర పు లక్ష్మి, ఎన్. హైమావతి, జి. అరుణ, బాగం వెంకయ్య, ప్రకాష్, పిఎస్‌ఎన్ రాజు, -ఎస్ కె సోందు, రమణారావు పాల్గొన్నారు.