24-01-2026 12:00:00 AM
మాగనూరు జనవరి 23: వసంత పంచమి శుక్రవారం సరస్వతి దేవి పుట్టినరోజు సందర్భంగా మాగనూరు మండలం లోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో, అంగన్వాడి కేంద్రాలలో, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో సరస్వతి దేవి చిత్ర పటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పాఠశాలల్లో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలలో అక్షరాభ్యాసము చేయించినా రు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ వసంత పంచమి రోజు సరస్వతి దేవి పుట్టినరోజు కావున చిన్నారులకు ఈరోజు అక్షరాభ్యాసం చేస్తే మంచి చదువులు చదివి ప్రయోజకులు అవుతారని వారన్నారు, ఈ కార్యక్రమంలో మార్గదర్శి పాఠశాల కరస్పాండెంట్ డి నరసింహులు, మేనేజ్మెంట్ అధ్యక్షులు ప్రహల్లాద రెడ్డి, ప్రిన్సిపాల్ వరప్రసాద్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ వనిత, ఉపాధ్యాయులు వెంకటయ్య గౌడ్, మహేష్ ,నర్మదా, తరుణ నాగేశ్వరి ,సోనాలి ,నరసమ్మ, మహేశ్వరి ,రేణుక, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.