calender_icon.png 24 May, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా అభివృద్ధిలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి

24-05-2025 12:11:56 AM

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ 

నారాయణపేట. మే 23(విజయక్రాంతి) : జిల్లా అభివృద్ధిలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ హాల్లో నారాయణపేట జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం ఈనెల 28న ఉన్నందున సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖ వారు నోట్స్ స్కీమ్స్ పై రేపటి వరకు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ మొగులప్ప జిల్లా అధికారులు పాల్గొన్నారు.