calender_icon.png 25 May, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి..

24-05-2025 08:24:17 PM

భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య..

బిచ్కుందలో తీవ్ర విషాదం..

కామారెడ్డి (విజయక్రాంతి): నిండు గర్భిణీ అయిన భార్యను పుట్టింటి నుంచి బైక్ పై తీసుకువస్తుండగా రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందింది. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 24 గంటల్లోనే భార్యాభర్తలు మృతి చెందడంతో కామారెడ్డి జిల్లా(Kamareddy District) బిచ్కుంద మండల కేంద్రంలో శనివారం విషాధం నేలకొంది. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన మంగలి సునీల్ కు అదే మండలం పెద్దతడుగు గ్రామానికి చెందిన జ్యోతితో గతేడాది వివాహం జరిగింది.

జ్యోతి 5 ఐదు నెలల గర్భిణి కావడంతో ఈనెల 14న పుట్టింట్లో సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 23న సునీల్ తన బైక్ పై భార్యను తడుగురు నుంచి బిచ్కుంద వస్తుండగా పెద్ద మైసమ్మ గుడి వద్ద బైక్ స్కిడ్ అయ్యి జ్యోతి కిందపడి మరణించింది. ఈ నేపథ్యంలో జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసుకుని బిచ్కుంద డెడ్ బాడీని తీసుకురాగానే సునీల్ తన ఇంట్లో యాసిడ్ తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఈ మేరకు బిచ్కుంద పోలీసులు కేసు నమోదు చేసినట్లు బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు.