calender_icon.png 25 May, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో బోధించాలి

24-05-2025 08:07:43 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ తరగతులు, నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో బోధన పద్ధతుల్లో అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు(District Education Officer Rama Rao) అన్నారు. జిల విజయ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులకు ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శిక్షణలో నేర్చుకున్న విషయాలను పాఠశాలలో అమలు చేయాలని, విద్యార్థులను శారీరకంగా, మానసికంగానూ సంసిద్ధులను చేసి వారిలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయాలని, విద్యా ప్రగతికి దోహదపడాలని సూచించారు.

ఇటువంటి శిక్షణలు ఇంకా ఇవ్వబడతాయని, ఉపాధ్యాయులు వీటిని వినియోగించుకొని భవిష్యత్తులో విద్యార్థులకు చక్కటి అవకాశాలు కల్పించాలని కోరారు. ఐదు రోజులుగా శిక్షణ ఇస్తున్న డిఆర్పీలు ఎం శ్రీనివాస్ వి భూమన్న జమున అన్నపూర్ణలను శాలువాలతో సత్కరించారు. వ్యాయమ ఉపాధ్యాయులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో కోర్సు బాధ్యులు యన్ ప్రవీణ్ కుమార్, డిఆర్పిలు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.