24-05-2025 08:20:00 PM
ఉపాధ్యాయుల శిక్షణ తరగతులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి..
జగదేవపూర్ (విజయక్రాంతి): జగదేవపూర్ మండల కేంద్రములో అయిదు రోజుల నుండి జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంను జిల్లా విద్యాధికారి ఈ. శ్రీనివాసరెడ్డి(District Education Officer Srinivas Reddy) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... శిక్షణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని స్కూల్ అసిస్టెంట్ లకు జిల్లా స్థాయిలో శిక్షణ తరగతులు సెకండరి గ్రేడ్ టీచర్ల లకు మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలని పాఠశాలలో తప్పని సరిగా పాటించి విద్యార్థులలో నైపున్యాలను పెంపోందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి యం. మాధవరెడ్డి, మండల రిసోర్స్ పర్సన్లు శంకర్, భాస్కర్, మౌనిక, వెంకటేశ్వర్లు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు దయానంద్, అరుంధతి, రమణ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.