24-05-2025 08:12:10 PM
తాడ్వాయి (విజయక్రాంతి): తాడ్వాయి మండల కేంద్రంలో నిర్వహించిన 5 రోజుల వృత్యంతర శిక్షణ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని ఎంఈఓ రామస్వామి(MEO Ramaswamy) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఐదు రోజులపాటు ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు వృత్యంత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శనివారం వృత్తింతర శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఎంఈఓ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు ఈ శిక్షణలో ఎంతో నేర్చుకున్నారని తెలిపారు. విద్యార్థులకు మెలకువలు నేర్పించడంలో ఈ శిక్షణ తోడ్పాటును అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు సంగాగౌడ్, ప్రభాకర్, రాజశేఖర్, ప్రశాంత్, మల్లేష్, రంజిత్, హేమలత, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.