24-05-2025 08:01:06 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) దోమకొండ మండల కేంద్రంలోని బాలూరు జిల్లా పరిషత్ పాఠశాలలో దోమకొండ మండల కోర్సు డైరెక్టర్ మాణిక్యం శర్మను మండల ఉపాధ్యాయులు శనివారం సన్మానించారు. గత ఐదు రోజులుగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న క్యాంపు సమావేశం అనంతరం దోమకొండ మండల ఉపాధ్యాయ శిక్షణ తరగతుల కోర్సు డైరెక్టర్ మాణిక్యం శర్మను ఉపాధ్యాయులు పాల్గొని శాలువాతో సన్మానించారు. శిక్షణ కార్యక్రమంలో ఆయన సలహాలు సూచనలు ఉపాధ్యాయులకు మెలకువలతో పాటు విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించే విధంగా అర్థమయ్యే తరహాలో శిక్షణ పొందపరచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమకొండ మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.