24-05-2025 07:56:37 PM
అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ చైతన్య రెడ్డి..
కామారెడ్డి (విజయక్రాంతి): తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం మే 26 సోమవారం రోజున కామారెడ్డి రక్తదాతల సమూహం, లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషనల్(International Vysya Federal) ఆధ్వర్యంలో ఆదిత్య హాస్పిటల్ కామారెడ్డిలో నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన కరపత్రాలను అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ చైతన్య వారి కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ... రక్తదానానికి యువత ముందుకు రావాలని రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 10 వేల మంది తలసేమియా చిన్నారులు ఉండడం చాలా బాధాకరం అని, వారి ప్రాణాలను కాపాడడానికి రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేస్తున్న రక్తదాతలకు ప్రశంస పత్రాన్ని, స్టీల్ వాటర్ బాటిల్ ను ఆదిత్య హాస్పిటల్ వారి సహకారంతో అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. రక్తదానం చేయాలనుకున్న రక్తదాతలు 9492874006 నెంబర్ కు సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్యక్షులు చిలువేరు మారుతి, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్ ఉపాధ్యక్షులు పర్శ వెంకటరమణలు పాల్గొనడం జరిగింది.