24-05-2025 07:53:11 PM
కామారెడ్డి (విజయక్రాంతి): బాస్మతి లోడుతో లారీని తీసుకెళ్లి బాస్మతి బియ్యాన్ని అమ్ముకున్న వ్యక్తిని శనివారం అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) తెలిపారు. 2023 సం.లో హర్షద్ అలీ అనే వ్యక్తి ఢిల్లీ నుండి బెంగళూరుకు బాస్మతి రైస్ ను లారీలో తీసుకవేళ్తూ, మార్గమధ్యలో ఆ రైస్‌ను సుమారు రూ. 3.5 లక్షల విలువకు విక్రయించి, ఖాళీ లారీని కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పీఎస్ పరిధిలోని పొందుర్తి వద్ద వదిలిపెట్టి పరారయ్యాడు. ఇట్టి దానిపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది.
నిందితుడు గత రెండు సంవత్సరాలుగా తప్పించుక తిరుగుతున్నాడు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక పోలీసు బృందం ఏఎస్‌ఐ నర్సింగరావు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి, కానిస్టేబుల్ రవికుమార్, పోలీస్ కానిస్టేబుల్ రవికిరణ్ లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి, నిందితుడిని గుర్తించి, పట్టుకున్నారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో చూపిన చాకచక్యం, నిబద్ధతకు గుర్తింపుగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్‌ఐ నర్సింగరావు, హెడ్ కానిస్టేబుల్ కృష్ణారెడ్డి, కానిస్టేబుల్ రవికుమార్ లను ప్రత్యేకంగా అభినందించారు.