24-05-2025 07:50:27 PM
మండల విద్యాధికారి మన్మథ కిషోర్..
నాగల్ గిద్ద (విజయక్రాంతి): విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత సంపూర్ణతను సహకారం చేయడమే విద్య లక్ష్యం అని మండల విద్యాధికారి మన్మథ కిషోర్(Mandal Education Officer Manmatha Kishore) తెలిపారు. నాగల్ గిద్ధ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు శిక్షణలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధనాలను ఆసక్తికరంగా చేస్తూ ప్రభుత్వం బడులను బలోపేతం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్ రావు,పిఆర్టియు మండల అధ్యక్షులు శేరికర్ రమేష్, ఎస్టియు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శివశంకర్ రాథోడ్, పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అధ్యక్షులు సూర్యకాంత్, గుండేరావు పాటిల్, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.