24-05-2025 07:58:45 PM
నాగల్ గిద్ద (విజయక్రాంతి): నాగలిగిద్ద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి మండల ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఆర్థిక, కులగణన సర్వే 2024 యొక్క పారితోషకం సర్వే నిర్వహించి దాదాపు ఆరు నెలలు గడిచిన ఇంత వరకు ఉపాధ్యాయులకు అందకపోవడంతో మండలంలోని ఉపాధ్యాయులు అందరూ కలిసి మండల ఎంపీడీవో కార్యాలయంలో ఇంచార్జ్ సూపర్డెంట్ పి శంకర్ కి వినతి పత్రం అందజేశారు. పై అధికారులను సంప్రదించి వెంటనే పారితోషికం మంజూరు చేయించాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కారముంగీ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రవీందర్ రావు, మండల పిఆర్టియు అధ్యక్షులు శేరీకర్ రమేష్, ఎస్టియు అధ్యక్షులు విజయ్ కుమార్, తపస్ అధ్యక్షులు ఓంబసవ మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.