calender_icon.png 9 September, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి

04-09-2025 01:11:00 AM

బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు ఎం.నగేష్ ముదిరాజ్

ముషీరాబాద్,  సెప్టెంబర్ 3(విజయక్రాంతి):  గణేష్ నవరాత్రి ఉత్సవాల సంద ర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో గల పలు గణేష్ మండపాలను దర్శించుకుని గణనాధుల ప్రత్యేక పూజా కార్యక్ర మంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎం. నగేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.

అనంతరం గణేష్ మండప నిర్వాహకులు ఏర్పాటు చేసి న అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆ గణనాథుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

చిక్కడపల్లిలో..

ఆర్టీసి క్రాస్ రోడ్స్ లోని గజానంద్ భక్త సమాజ్ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం చిక్కడపల్లి గణేష్ మండపాల వద్ద  ఏర్పాటు చేసిన అన్నదాన  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ మెంబర్ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశా రు. 

అనంతరం భక్తులకు ఆన్న ప్రసాదాన్ని అందచేసారు. ఈ  కార్యక్రమంలో బీజేపీ డి విజన్ అద్యక్షుడు వీ.నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,పి నర్సింగ్ రావు,  గజానంద్ భక్త సమాజ్ సభ్యులు శేఖర్, సుజ్జు, గీతు, తదితరులు పాల్గొన్నారు.

గాంధీనగర్ డివిజన్లోని వివేక్ నగర్లో వివేక్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూ జలు చేసిన  ముషీరాబాద్ బిఆర్‌ఎస్ పార్టీ మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్ పద్మా దంపతులు. ఈ  కార్యక్రమంలో శివకుమార్, హర్ష, మనోజ్ కుమా ర్, కత్తులశివ, సుశీల్ కుమార్ పాల్గొన్నారు.