05-12-2025 12:39:53 AM
తలమడుగు డిసెంబర్ 4(విజయక్రాంతి) : ప్రజలందరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. మండలంలోని సాయిలింగి గ్రామంలో శ్రీ సాయిబాబా ఆలయ 25 సం వత్సరాల వార్షికోత్సవం వేడుకలు వైభవం గా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు దెబ్బడి అశోక్ ఆధ్వర్యంలో ఆలయ వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
గత ఐదు రోజుల నుంచి సాయిబాబా నూతన ఆభరణాలకు, పూజ లు నిర్వహించి గ్రామంలో ఊరేగింపు, చండియజ్ఞం నిర్వహించారు. గురువారం వార్సికో త్సవం చివరి రోజు వేడుకల్లో ముఖ్య అతిథులుగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాట్లాడుతూ.. దేవుడు అందరికి ఒక్కడేనని, సబ్ కా మాలిక్ ఎక్ హై అని సాయిబాబా చెప్పేవారన్నారు. ఈ కార్యక్రమంలో తోట అశోక్, దర్ల రవి, శేవ్వ పోచ్చ న్న, బీఆర్‌ఎస్ పార్టీ కన్వీనర్ తోట వెంకటేష్,అడ్వకేట్ శ్రీకాంత్, ప్రకాష్, ప్రమోద్, ఆశన్న యాదవ్, పోచన్న పాల్గొన్నారు.