calender_icon.png 5 December, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంపెనీల పేరు చెప్పి పేదల భూములు గుంజుకున్నరు

05-12-2025 12:42:25 AM

  1. బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ 

సిర్పూర్ ప్రజలే నా కుటుంబ సభ్యులు

కాగజ్‌నగర్, డిసెంబర్ ౪ (విజయక్రాం తి): స్థానిక ప్రజల కోసం కంపెనీలు పెడుతున్నామని భూమి ఇచ్చిన వారికి ఉద్యోగం  ఇస్తామని నమ్మించి పేదల భూములను గుంజుకొని బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి కంపెనీ ఏర్పాటు చేయకుండా ప్రజలను మోసం చేశారని బిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమా ర్ ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గురువారం కాగజ్‌నగర్ మండలం లోని జగన్నాథపూర్ గ్రామంలో పర్యటించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు జగన్నాథపూర్ ప్రాజెక్టు పాలకులు ఎందరు మారినా ఎందుకు పూర్తిచేయలేద ని ప్రశ్నించారు.

గత పాలకులు జగన్నాథపూర్ ప్రాజెక్టును ఇసుక దందా చేయడానికే వాడుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు కట్టకుండా, కాలువలు తవ్వి వదిలేశారని, ప్రజ లు కాగజ్ నగర్ వెళ్లడానికి కనీసం బ్రిడ్జి కూ డా నిర్మించలేకపోయారని విమర్శించారు.

సిర్పూర్ నియోజకవర్గంలో నాకు బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరూ లేరని, ఆస్తులను కుటుంబ సభ్యలకు పంచడం, కాంట్రాక్టులు బంధువులకు ఇవ్వడం వంటి పనులు చేయనని, నేను ఇతర ప్రాంతాల నుండి బంధువుల కుటుంబాలను ఇక్కడికి తీసుకొచ్చి దోపిడీ చేయనన్నారు. సిర్పూర్ ప్రజలే నా కుటుంబ సభ్యులని స్పష్టం చేశా రు. ప్రజల అభివృద్దే నాకు ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు,సీనియర్ నాయకులు కొంగ సత్యనా రాయణ, మండల కన్వీనర్ పర్వతి అంజన్న, మహేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.