calender_icon.png 5 December, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తి శ్రద్దల మధ్య గిరి ప్రదర్శన

05-12-2025 12:38:25 AM

లక్షెట్టిపేట టౌన్, డిసెంబర్ 4 : కార్తీక పౌర్ణమిని పురష్కరించుకొని మున్సిపాలిటీ పరిధిలోని మోదెల శివారులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహ స్వామి ఆలయం వద్ద భక్తులు గురు వారం పురోహితులు కొత్తపళ్లి భరద్వాజ శర్మ ఆధ్వర్యంలో ఎనిమిదవ గిరి ప్రదర్శన నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి రోజున గిరి ప్రదర్శన ఉంటుందని, భక్తులు గుట్టపై వెలసిన స్వామివారిని మార్గశిర మాసంలో దర్శించుకుంటే ఎంతో పుణ్యమని పురోహితులు తెలిపారు. 

గిరి ప్రదర్శన అనంతరం స్వామివారికి  పంచామృతాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భగవద్గీత, హనుమాన్ చాలీసా పారాయణం, శివ శంకర భక్తమండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.