దారులన్నీ కొండగట్టుకే..
జగిత్యాల, ఏప్రిల్1(విజయక్రాంతి); శ్రీరామ జయ రామ.. జయ జయ రామ.., రామ లక్ష్మణ జానకీ జై.. జై బోలో హనుమాన్ కీ.. అనే దీక్షాపరుల సంకీర్త నలు, వేలాదిగా తండోపతండాలుగా వస్తున్న దీక్షాపరులు, భక్తుల జై హనుమాన్ ఘోషతో జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానం పులకిస్తోంది. రామదండును తల పిం చేలా భక్తులు కొండగట్టుకు వస్తూండగా ఆలయం కాషాయ వర్ణంతో కళకళలాడుతోంది.
గురువారం నుంచి ప్రారంభమైన హనుమాన్ జయంతి ఉత్స వాలతో కొండంతా భక్తజన శోభితంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లానుంచే కాకుండా ఉమ్మడి హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలు తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా దీక్షాపరులు కాలినడకన, వాహనాల్లో కొండపైకి చేరుకుని మాల విరమణ చేస్తున్నారు.
హనుమాన్ చిన్న జయంతిని పురస్కరించుకుని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో గురువారం అత్యంత వైభవంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వేలాది దీక్షాపరులు మాల విరమణ చేసేందుకు కొండగట్టుకు తరలివస్తున్నారు. ఆలయ ఈ ఓ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.




