05-12-2025 06:10:39 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలం తాంశ, సోను మండల కేంద్రంలోకి చెందిన టిఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు గ్రామ తాజామాజీ ఉప సర్పంచ్ మహేష్ రెడ్డితో పాటు పలువురు గ్రామస్థులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. శుక్రవారం ఎమ్మెల్యేలు కలిసి పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలను వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జమాల్, శ్రీనివాస్, గంగాధర్, రాములు, G. శ్రీనివాస్, బక్కన్న, సాగర్, సుధాకర్, రవి తో పాటు తదితరులు పాల్గొన్నారు.