calender_icon.png 17 December, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్డు ఫలితాన్ని తారు మారు చేసిన డబల్ ఓటు

17-12-2025 12:00:00 AM

కొత్తపల్లి, డిసెంబర్ 16(విజయక్రాంతి): కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో ఒక ఓటర్ పేరు రెండు వార్డ్ లలో నమోదయి ఉండటంతో సదరు ఓటరు రెండు ఓట్లు వేయడంతో ఆరో వార్డు అభ్యర్థి ఒక ఓటుతో ఓటమి చవి చూడవలసి వచ్చింది.వివరాల్లోకి వెళితే కమాన్ పూర్ గ్రామంలో దండుగల కృష్ణ అనే వ్యక్తి కి సీరియల్ నెంబర్ 1132 తో 5వ వార్డ్ లో ఓటరు గా నమోదై ఉన్నాడని అదేవిధంగా 1605 వ సీరియల్ నంబర్ తో ఆరవ వార్డులో ఓటర్ గా నమోదు ఉన్నాడని అంతేకాక ఆరో వార్డులో ఒకానొక సర్పంచ్ అభ్యర్థికి పోలింగ్ ఏజెంట్గా కూడా ఉన్నాడని అయితే సదరు ఓటరు ఐదో వార్డులో ఓటు వేయడమే కాకుండా ఆరో వార్డులో కూడా రెండో ఓటు వేశారని, ఈ అక్రమ ఓటు వలన తాను ఒక్క ఓటు తేడాతో ఓడిపోయినానని కమాన్ పూర్ గ్రామం ఆరవ వార్డ్ లో ఓడిపోయిన అభ్యర్థి కరీంనగర్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాడు.

ఓటర్ నమోదు మరియు ఓటర్ లిస్ట్ వెరిఫై చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారితోపాటు రెండు ఓట్లు వేసిన ఓట్ప విచారణ జరిపి కేసు నమోదు చేయాలని, దానీతో పాటు ఆరో వార్డుకు మళ్ళీ ఎన్నిక నిర్వహించి తగిన న్యాయం జరిపించాలని సదర్ అభ్యర్థి కోరారు.