విద్యార్థులందరూ సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ఎంఈఓ ధర్మనాయక్
మిర్యాలగూడ, మే 15 : విద్యార్థులందరూ పాఠశాలల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు లను సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి డి.ధర్మానాయక్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని పీఎం శ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్, ఎస్‌ఎస్సి విద్యార్థుల, రెమడియల్ తరగతులను శుక్రవారం సందర్శించారు. సమ్మర్ క్యాంపులో విద్యార్థులు వివిధ రకాలైన క్యారం బోరడ్స్, చెస్ ,రింగ్ బాల్, డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ అల్లికలు తదితర కార్యక్రమాలను విద్యార్థులకు నేర్పిస్తున్నారు.
ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమిడీయల్ తరగతులను ఉపాధ్యాయులు విద్యార్థులకు అందిస్తున్నారు. ఈ అవకాశాలను విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు విజయకుమారి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.






