calender_icon.png 21 May, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరంగా ర్యాలీలో సకల జనులు

21-05-2025 12:00:00 AM

నాగర్ కర్నూల్ మే 20: పహల్గం ఘట నకు ప్రతీకారంగా భారత ఆర్మీ తన అస మాన ధైర్య సాహసాలతో ఆపరేషన్ సింధూ ర్ పేరుతో  పాకిస్తాన్ ముష్కరుల ఉగ్రవాద స్థావరాలను విధ్వంసం చేసి పాకిస్తాన్ గి గట్టి బుద్ది చెప్పిన దేశ ఆర్మీ సైన్యానికి మద్దతు నిస్తూ మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వెంట సిటిజన్ పర్ నేషనల్ సెక్యూరిటీ పేరుతో నిర్వహిం చిన ఆపరేషన్ సింధూర్ తిరంగా ర్యాలీలో జిల్లాలోని అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

పటంలోని ఆర్డీవో కార్యాల యం నుండి ఆర్మీ సైన్యానికి మద్దతు పలుకు తూ దేశ సమైక్యతను చాటుతూ నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల గుండా  ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా పట్టణ ప్రజలు, మేధా వులు, విశ్రాంత ఉద్యోగులు సామాన్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.