05-09-2025 12:00:00 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాం తి): హరీశ్‌రావుపై తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని బీఆర్‌ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయా ల్లో నిలదొక్కుకోవడానికి నాడు విమర్శలు చేశానని గురువా రం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. నేను చేసింది అని కూడా అప్పుడే ఒప్పుకున్నానని, కానీ కొందరు దద్దమ్మలు పాత వీడియోను ఇప్పుడు తిప్పుతున్నారని మండిపడ్డారు.
ఆ సన్నాసులకు చెప్పులతో సన్మానం చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మల్లన్నసాగర్ విషయంలో తాను తప్పు మాట్లాటానని ఒప్పుకున్నట్టు గుర్తు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉండి మల్లన్నసాగర్ మీద కొట్లాడినా, తప్పును ఒప్పుకున్నట్టు స్పష్టం చేశారు