calender_icon.png 5 September, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

04-09-2025 11:35:48 PM

సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సంధ్యారాణి(Deputy DMHO Dr. Sandhyarani) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు రికార్డులు పరిశీలించారు. ఔట్ పేషెంట్స్ సంఖ్య, వైద్య చికిత్సలపై ఆమె ఆరా తీశారు. స్థానికంగా కొనసాగుతున్న ప్రసవాలపై డాక్టర్ ప్రతిభతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపీహె చంద్రశేఖర్, HA జట్ల భాస్కర్, రామచందర్, ఫార్మసిస్టు రఘు పాల్గొన్నారు.