04-09-2025 11:34:01 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ధర్తీ అభా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంలో మారుమూల గిరిజన హరిజన ఆవాస ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మోహన్ రావు(NPDCL Director Mohan Rao) తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం గాంధీనగర్ లో నూతన విద్యుత్ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ విజేందర్ రెడ్డి, డిఈలు విజయ్, మర్రెడ్డి, సునీతాదేవి, మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, ఏడిఈ ఐలయ్య, ఏ ఈ రాజు పాల్గొన్నారు.