calender_icon.png 13 September, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో దొంగలు పడ్డారు.. పట్టపగలే దోచుకుంటున్నారు

13-07-2024 03:14:13 PM

హైదరాబాద్ : అవినీతి టెండర్లను రద్దు చేసి, గ్లోబల్ టెండర్లను పిలవాలని డిమాండ్ చేస్తున్నట్లు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రజలకు తెలియకుండా రాష్ట్రంలో దొంగలు పడి, దొంగ జీవోలను జారీ చేస్తూ పట్టపగలే దోచుకుంటున్నారని ఆరోపించారు. పనులన్నీ ఏపీ గుత్తేదారులకు ఇస్తున్నారని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.

కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్నీ పనులను ఏపీ గుత్తేదారులకే అప్పగిస్తోందన్నారు. తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. చీకటి జీవోలు, చీకటి ఒప్పందాలతో దోచుకుంటున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో దొంగలు పోయి.. గజదొంగలు వచ్చినట్లుగా పరిస్థితి తయారైందన్నారు.