calender_icon.png 23 December, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో పారమిత విద్యార్థి ప్రతిభ

23-12-2025 07:05:41 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): నగరంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి కొత్తపెల్లి రిషిత్ రాష్ట్ర స్థాయి జూడో చాంపియన్ షిప్  పోటీలలో రజత పతకం సాధించాడని  పాఠశాల డైరెక్టర్ హనుమంత రావు  తెలిపారు. రాష్ట్ర స్థాయి పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 20 నుండి 22 వరకు హన్మకొండ పట్టణంలోని జె.ఎన్ స్టేడియంలో జరిగిన  69వ రాష్ట్ర స్థాయి జూడో  బాలుర చాంపియన్ షిప్ పోటీలలో రిషిత్  అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించాడని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా  విద్యార్థిని పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు,  డైరెక్టర్లు ప్రసూన, రాకేష్, రశ్మిత, అనుకర్ రావు, వినోదరావు, వి.యు. ఎం. ప్రసాద్,  హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు గోపిక్రిష్ణ, సమన్వయకర్త రబీంద్రపాత్రో, వ్యాయామ ఉపాధ్యాయులు   గోలి సుదాకర్ అభినందించారు.