23-12-2025 07:38:41 PM
క్రాంతి విద్యాలయం కరస్పాండెంట్ సమత శ్రీనివాస్
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం క్రాంతి విద్యాలయంలోఫ్రీ క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి సమత శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ యేసుప్రభు చూపిన ప్రేమ, దయా,కరుణ ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దైవచింతనతో ఇతరులకు చేయూతనివ్వడమే యేసుక్రీస్తు బోధనల పరమార్థం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రీ ప్రైమరీ చిన్నారులు శాంటా క్లాస్, దేవదూతల వంటి వివిధ వేషధారణలో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐ .హేమ శిల్ప అధ్యాపక, అధ్యాపకేతర బృందంతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.