calender_icon.png 23 December, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

50% సీలింగ్ రిజర్వేషన్లు ఎత్తివేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి

23-12-2025 07:30:27 PM

నస్పూర్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం 50% సీలింగ్ రిజర్వేషన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా మేము ఎంతో, మాకంత వాటాకై ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ల దాటవద్దని తీర్పును బూచిగా చూపిస్తుందన్నారు.

రాజ్యాంగంలో ఎక్కడ 50% రిజర్వేషన్లు దాటరాదని ఎక్కడ లేదనీ, సుప్రీంకోర్టు జడ్జీలు నలుగురు కలిసి తీసుకున్న నిర్ణయం మాత్రమే అగ్రకులాలకు 10% రిజర్వేషన్లతో 50% సీలింగ్ దాటిందనీ, దానికి ఏ సీలింగ్ అడ్డురాదని, రాజ్యాంగ సవరణ ద్వారా 10% రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ చేసి విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజ్జల్లి వెంకటయ్య, శాఖపూడి భీమ్ సేన్, చంద్రగిరి చంద్రమౌళి, అంకం సతీష్, రామగిరి రాజన్న చారి, ధర్మాజీ మల్లేష్, చెలిమెల అంజయ్య, వేముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.