calender_icon.png 23 December, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోథ్‌లో హిందూ సంఘాల నిరసన

23-12-2025 07:10:08 PM

బంగ్లాదేశ్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

బోథ్,(విజయక్రాంతి): బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మంగళవారం బోథ్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసి, బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై అత్యంత పాశవికంగా దాడి చేస్తూ మారణ హోమం కొనసాగించడం చాలా  బాధాకరం అన్నారు.

ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేసే మేధావులందరూ ఎక్కడికి వెళ్లారని ఈ మారణకాండపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కనీసం దాడులను ఖండిస్తూ ఒక ప్రకటన కూడా చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఓట్ల కోసం రాజకీయాలు కాకుండా హిందువుల ప్రాణాలు రక్షించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, వెంటనే హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.