calender_icon.png 20 November, 2025 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణ ఎడారే: మహేశ్వరరెడ్డి

24-07-2024 03:04:55 PM

కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏడారిగా మారుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదని మహేశ్వర రెడ్డి విమర్శించారు. ఏపీకీ రూ. 10 వేల కోట్లు ఇచ్చారని పదేపదే చెప్పడం సరికాదని ఆయన పేర్కొన్నారు. కేంద్రానికి మీరు డీపీఆర్ లు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. మూసీ నదిని ఏటీఎంలా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి రూ, 4 వేల కోట్లు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని రేవంత్ రెడ్డి భయపడుతున్నారని మహేశ్వరరెడ్డి జోస్యం చెప్పారు. కేంద్రం పదేళ్లలో రాష్ట్రానికి రూ. 9 లక్షల 25 వేల కోట్లు ఇచ్చిందని లెక్క చెప్పారు. కేంద్రానికి ఏ రాష్ట్రం మీద కూడా వివక్ష ఉండదన్నారు.