calender_icon.png 20 November, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మీకేం ఇబ్బంది..?

24-07-2024 02:21:36 PM

హైదరాబాద్: శాసించి సాధించుకోవాలి.. యాచిస్తే ఏమీ రాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర వివక్షను ఎండగట్టడంలో తాము కూడా సహకరిస్తామని సూచించారు. కేంద్రం సాయం చేయకపోయినా ఎంతో అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మీకేం ఇబ్బంది? అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కష్టపడే  ఈ స్థాయికి చేరుకున్నారు.. రేవంత్ రెడ్డి చిన్న వయస్సులోనే సీఎం అయ్యారు. చిన్న వయస్సులోనే సీఎం అయినందుకు రేవంత్ రెడ్డికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

మేం ఏం మాట్లాడాలో కూడా మీరే చెబితే ఎట్లా? అని కేటీఆర్ ప్రశ్నించారు. డిస్క్ మ్ లలో ఏం జరుగుతుందో ఆ శాఖమంత్రి భట్టి విక్రమార్క తెలుసుకోవాలన్నారు. బిల్లు కలెక్షన్ కు వెళ్లే అదానీ మనుషులు వచ్చారని గొడవలు అయ్యాయో లేదో తెలుసుకోవలని సూచించారు. అదానీ మనుషులు వచ్చారని పాతబస్తీలో గొడవలు జరిగాయని ఇంటెలిజన్స్ రిపోర్టు ఇచ్చిందో లేదో తెలుసుకోవాలన్నారు.

పాతబస్తీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి వారి భయాలు తొలగించండని కేటీఆర్ సూచించారు. తమ ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే.. అందుకే ప్రజలు శిక్షించి ఇక్కడ కూర్చోబెట్టారు కాదా. మేం పొరపాట్లు చేశామని అనుకుంటే మీరు సక్రమంగా చేయండన్నారు. డిస్క్ మ్ లు ప్రైవేటీకరించం.. అదానీకి ఇవ్వం అని సీఎం ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా తాము ప్రవేటీకరణకు వ్యతిరేకం అని కేటీఆర్ పేర్కొన్నారు.