24-07-2024 03:27:33 PM
కేటీఆర్ ది మేనేజ్ మెంట్ కోటా అనుకున్నా.. అంతకంటే దారుణం
తండ్రి పేరు చెప్పుకొని నేనే మంత్రిని కాలే
సభను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు
హైదరాబాద్: కీలకమైన చర్చకు కేసీఆర్ ఎందుకు రాలేదు? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ ది మేనేజ్ మెంట్ కోటా అనుకున్నా.. అంతకంటే దారుణం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తండ్రి పేరు చెప్పుకొని నేను మంత్రిని కాలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కిందిస్థాయి నుంచి ఎదిగి ముఖ్యమంత్రిని అయ్యానని ఆయన పేర్కొన్నారు. అవగాహనారాహిత్యంతో సభను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న ఢిల్లీ వెళ్లి చీకట్లో మాట్లాడుకుని వచ్చారని సీఎం ఆరోపించారు.
మాకేమీ అక్కర్లేదు.. మీ ప్రేమ చాలని చెప్పిన మనిషి కేసీఆర్ అని సీఎ అన్నారు. విద్యుత్ పై రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక విధానమే లేదన్నారు. రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోయారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పరిపాలనలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని స్పష్టం చేశారు. మీరేం చేశారో చూశాకే ప్రజలు తీర్పుఇచ్చారన్నారు. బీఆర్ఎస్ కు.. అసెంబ్లీలో వచ్చిన మెజారిటీ లోక్ సభ ఎన్నికల్లో రాలేదని విమర్శించారు. లోక్ సభలో గుండుసున్నా దక్కినా తీరు మారకుంటే ఎలా? అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల హక్కులు కోసం మాట్లాడాలని కోరుతున్నానని సీఎం పేర్కొన్నారు.