calender_icon.png 5 July, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా నాయకత్వం మారుతున్నదా?

05-07-2025 02:25:10 AM

చైనా రాజకీయాలు ఎప్పుడూ ప్రపం చ దృష్టిని ఆకర్షిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ త(సీసీపీ) నాయకత్వంలో, జిన్ పింగ్ గత దశాబ్ద కాలంగా అధ్యక్షుడిగా, పార్టీ జనరల్ సెక్రటరీగా ఒక వెలుగు వెలుగుతూ వచ్చారు. 2025 వచ్చేసరికి జిన్‌పిం గ్‌కు కాలం కలిసిరావట్లేదనే చర్చ మొదలైంది. ఆయన అధికారం తప్పకుండా కో ల్పోతారని ఊహాగానాలు మొదలయ్యా యి.

అందుకు అనుగుణంగానే అక్కడి పరిణామాలు కూడా ఉన్నాయి. జిన్‌పింగ్‌కు సన్నిహితులుగా పేరున్న అనేక మంది అధికారులపై వేటు పడుతున్నది. చైనా రా జకీయాల్లో తాజా పరిణామాలను, అధ్యక్ష అధికార మార్పిడి గురించి ప్రపంచ మీడి యా చేస్తున్న వ్యాఖ్యలు ఏవిధంగా ఉన్నా యో చర్చిద్దాం. 

చైనా అంటేనే జిన్‌పింగ్ 

చైనా అంటేనే జిన్‌పింగ్ అనేలా గత కొ ద్ది రోజులుగా పరిస్థితులు మారిపోయా యి. 2012లో అధికారంలోకి వచ్చిన జిన్‌పింగ్ క్రమక్రమంగా తన ప్రాబల్యం పెం చుకుంటూ వచ్చారు. 2018లో అధ్యక్ష పదవీ కాలపరిమితిని రద్దు చేసిన జిన్ పింగ్ ఇక జీవితాంతం అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగుమం చేసుకున్నా రు. 2023లో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ మరో ఐదేండ్ల పాటు ఆయన పదవీకాలా న్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.

దీంతో ఇక ఆయనకు తిరుగులేకపోయింది. ఈ పరిణామాలు పార్టీపై ఆయనకున్న పట్టు ను, పార్టీలో ఆయన ఆధిపత్యాన్ని చూపెట్టాయి. తనకు తిరుగులేదని జిన్‌పింగ్ భావిస్తూ ఉండగా.. 2025 జూన్‌లో ఆయ న రాజకీయ జీవితం ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. జూన్‌లో జరిగిన సీసీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో కొత్త నియమాలు ప్రతిపాదించారు.

ఈ నియమాలు జిన్‌పింగ్ స్థాపించిన శక్తివంతమైన కమిటీలు, సంస్థలను నియంత్రించే విధంగా ఉ న్నట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కొత్త నిబంధనలపై సర్వత్రా చర్చ జరిగింది. జిన్‌పింగ్ ఏకఛత్రాధిపత్యానికి క మ్యూనిస్టు పార్టీ కొత్త నిబంధనల ద్వారా కల్లెం వేసిందని అంతా చర్చించుకున్నారు. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ తీసుకుంటు న్న ఏకపక్ష నిర్ణయాలను పరిమితం చేసేందుకు సీసీపీ కమిటీ .

ఈ నిబంధనలు ప్రవే శపెట్టిందని చాలా మంది పేర్కొన్నారు. అంతే కాకుండా అధికార వికేంద్రీకరణకు దారితీసే సంస్థాగత యంత్రాంగాన్ని ఈ నిబంధనల వల్ల సృష్టించవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి చ ర్చలు చైనా రాజకీయ వ్యవస్థలో మునుపెన్నడూ కనిపించలేదు, వినిపించలేదు. జిన్ పింగ్‌కు పార్టీపై ఉన్న పట్టు క్రమంగా తగ్గు తూ వస్తోందనే ఊహాగానాలు వినవస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఆ వార్తలు నిజమే అని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 

అధ్యక్ష మార్పిడి ఊహాగానాలు

చైనాలో అధ్యక్ష మార్పిడి గురించి ఇటువంటి వార్తలు రావడం, ఇలా చర్చలు జర గడం చాలా అరుదు. సాధారణంగా ఆ ఇనుప తెరలు చీల్చుకుని సమాచారం బయటకు రావడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. 2025లో చైనా ఆర్థిక సవాళ్లు... ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మార్కెట్ సం క్షోభం మొదలయిన కారణాలు జిన్‌పింగ్ నాయకత్వంపై ఒత్తిడిని పెంచాయి. ఇదే విషయాన్ని అనేక మంది ప్రస్తావిస్తున్నా రు.

ఇక అంతే కాకుండా జిన్‌పింగ్‌కు ఆరో గ్యం కూడా సహకరించడం లేదనే వార్తలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జిన్‌పింగ్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవచ్చని అంతా అంచనా వేస్తున్నారు. జిన్‌పింగ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయగానే ఆయన వారసుడిగా మరొకరిని ఎన్నుకునే అవకాశం ఉందని అంతా అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే తరహా చర్చ జరుగు తోంది.

జిన్‌పింగ్ అనంతరం అధ్యక్ష పదవి చేపట్టే వారిలో ఇద్దరు ముగ్గురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరి పేర్లపైనే సాధారణ జనంలో కూడా ఎక్కువగా చర్చ జరుగుతోంది. అయితే ఇ వన్నీ ఊహాగానాలు మాత్రమే. వీటి గురిం చి ఏ అధికారి ఎక్కడ మాట్లాడింది లేదు. చైనాలో జరిగే విషయాలు అస్సలుకే బ యటకు తెలియవు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో జరిగే విషయాలు అస్సలుకే బయటకు పొక్కవు.

అందుకోసమే  ఈ సమాచారం వాస్తవమా? లేక వదంతా? అని అంతా సంశయిస్తున్నారు. అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇప్పటికీ బలంగానే ఉన్నారని, సీసీపీలో ఆయనకు గట్టి మద్దతు ఉందని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. మరి వీటిల్లో ఏవి నిజమో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వెలువడేంత వరకు వేచి చూడక తప్పదు.

ప్రపంచ మీడియా స్పందన.. 

చైనా రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రపంచ మీడియా ఆసక్తిగా గమనిస్తోంది. ప్రపంచంలోని కొ న్ని మీడియా మీడియా సంస్థలు,  జిన్‌పింగ్ అధికారం బలహీనపడుతోందని రిపోర్టులు వెలువరిస్తున్నాయి. ఆ దేశంలో తీసుకొచ్చిన కొత్త నియమాలు ఆయన నిర్ణయాధికారాన్ని పరిమితం చేస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

చై నా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధికారం చు ట్టూ ఊహాగానాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని హన్క్యుంగ్ మీడియా నివేదిం చింది. ఆర్థిక సంక్షోభం కారణంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారం పరీక్షకు గురవుతోందని అమెరికన్ మీడియా వ్యా ఖ్యానించింది. ఇంకొంత మంది జిన్‌పింగ్ అధికారాన్ని వదులుకునే అవకాశం తక్కు వ అని వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నూ జిన్‌పింగ్ అధ్యక్షుడిగానే కొనసాగుతుతారని అంటున్నారు.

మరోవైపు చూసు కుంటే ఆసియా- పసిఫిక్ విశ్లేషకులు, మరీ ముఖ్యంగా సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చోంగ్ జా ఇయాన్... చైనా రాజకీయ ప్రతిస్పందనలు నిశితంగా గమనిస్తున్నట్టు తెలిపారు. మునుపెన్నడూ ఇ టువంటి పరిస్థితులు చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికాతో వాణిజ్య ఉ ద్రిక్తతల నేపథ్యంలో జిన్‌పింగ్ రాజకీయ స్థిరత్వాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ సందిగ్ధత ఎంతకాలం కొనసాగుతుందనేది పెద్ద ప్రశ్నగా మారిందని అభిప్రాయపడ్డారు.

ఆర్థిక సవాళ్లు.. రాజకీయపరమైన ఒత్తిళ్లు

2025లో చైనా ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు రాజకీయ చర్చలకు ఊతం ఇస్తున్నాయి. రికార్డు స్థాయిలో నిరుద్యోగం, అంతర్జాతీయ మార్కెట్ కుప్పకూలడం, పెరుగుతున్న అప్పులు వంటి సమస్యలతో అక్కడి అధికార యంత్రాంగం మరీ ముఖ్యంగా జిన్‌పింగ్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌లో ప్రీమియర్ లి కియాంగ్ దేశీ య వినియోగాన్ని పెంచడం, ఆర్థిక వృద్ధిని సాధించడం మీద దృష్టి పెట్టాలని నొక్కి చెప్పారు.

ఈ ఆర్థిక వ్యూహం జిన్‌పింగ్ అమలు చేస్తున్న “చైనీస్-శైలి ఆధునీకరణ” దృష్టిని కొనసాగిస్తుందని, అయితే అధికార మార్పిడి గురించి స్పష్టమైన సూచన లు లేవని మీడియా విశ్లేషణలు చెబుతున్నాయి. చివరగా... చైనా రాజకీయ వ్యవస్థ లో  జిన్‌పింగ్ అధికారం ఇప్పటికీ బలంగానే ఉందని తెలుస్తున్నప్పటికీ, చైనాలో ఏర్పడిన ఆర్థిక సవాళ్లు, కొత్త నియమాల చర్చలు ఆయన నాయకత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో అధికార మార్పిడి గు రించి వ్యాప్తి చెందుతున్న ఊహాగానాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఊహాగానాలను మనం పూర్తిగా నమ్మలేం. ఎందుకం టే అవి ఇంకా నిరూపితం కావాల్సి ఉంది. ప్రపంచ మీడియా ఈ పరిణామాలను దగ్గరగా పరిశీలిస్తూ, చైనా రాజకీయ స్థిరత్వం, ఆర్థిక వ్యూహాలపై దృష్టి పెడుతోంది.

చైనా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కాలమే నిర్ణయిస్తుంది, కానీ ప్రస్తుతం జిన్‌పింగ్ నాయకత్వం కీలక దశ లో ఉందని మాత్రమే చెప్పవచ్చు. అమెరికాతో ఇటీవలే వాణిజ్య ఒప్పందం కుదిరి న సందర్భంలో జిన్‌పింగ్‌కు ఈ ఆంశం కాస్త ఊరటనిస్తుందని అంతా కామెంట్ చేస్తున్నారు. 

వ్యాసకర్త సెల్: 98493 28496