21-10-2025 07:11:47 PM
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసుల అమరవీణ స్తూపం వద్ద ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పుష్పాంజలి ఘటించి వారి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల సేవలు చాలా విశిష్టమైనవని, వారి ద్వారానే సమాజంలో అన్ని వేళల్లో మతసామరస్యాన్ని సంరక్షిస్తూ శాంతిభద్రతలను నెలకొల్పుతూ సమాజ అభివృద్ధికి అన్ని వేళల్లో చేయూతనిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ అమూల్యమైన పోలీసు కుటుంబాలకు అండగా ఉండాలని, వారి కుటుంబ సభ్యుల అభివృద్ధికి చేయూతనివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు విఎన్ఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.