calender_icon.png 12 May, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అపూర్వ విద్యార్థుల సమ్మేళనం

11-05-2025 10:33:54 PM

నడిగూడెం: ఆనందం వెల్లివిరిసింది.. ఎప్పుడో కలిసిన మనం ఇప్పుడు ఇలా కలవడం ఆనందం అనుకునేలా ఎగసిపడేలాంటి సంతోషం ఇది అపూర్వ సమ్మేళనం. మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-2005 లో 10వ తరగతి చదివిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆ రోజుల్లో విద్య బోధన చేసిన ఉపాధ్యాయులకు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు ఒకరిని ఒకరు అక్కున చేర్చుకొని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కన్నీటి పర్వతమయ్యారు. అనంతరం వారు చదివిన పాఠశాలకు 20 వేల రూపాయల డొనేషన్ ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ కార్యక్రమంలో మేకల గంగరాజు మామిడి రామకృష్ణ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.