calender_icon.png 12 May, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా డిగ్రీ కళాశాలను మానుకోటలోనే కొనసాగించాలి

11-05-2025 10:29:48 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి మంజూరైన మహాత్మా జ్యోతిబాపూలే మహిళ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను మహబూబాబాద్ లోనే కొనసాగించాలని, ఇందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావుకు బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యదర్శి ముంజాల రాజేందర్ గౌడ్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2023 24 విద్యా సంవత్సరంలో మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల మానుకోట జిల్లాకు మంజూరు చేశారని, అయితే ఇక్కడ సరైన బిల్డింగ్ లేదనే కారణంతో హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడిలో నిర్వహిస్తున్నారని చెప్పారు. దీనివల్ల ఈ ప్రాంత విద్యార్థులు అక్కడికి వెళ్లి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇక్కడే సరైన వసతి చూపించి మానుకోటలోనే మహిళా డిగ్రీ కళాశాల నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు జెర్రిపోతుల వెంకన్న గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మారినేని వెంకన్న, మాజీ కౌన్సిలర్ ఎడ్ల వేణు యాదవ్, గండి వీరేందర్ గౌడ్, శ్రీధర్ రజక, వీరభద్రం, వీరన్న ముదిరాజ్, వెంకన్న మహారాజ్, తదితరులు పాల్గొన్నారు.