05-07-2025 07:25:15 PM
మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ మండలం(Medchal Mandal) ఘనపూర్ సమీపంలోని మెడిసిటీ మెడికల్ కాలేజీ(MediCiti Institute of Medical Sciences)లో శనివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 2005లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు వైద్య వృత్తిలో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆడిటోరియంలో సమావేశమయ్యారు. వివిధ దేశాలలో వైద్యులుగా స్థిరపడిన వారు ప్రత్యేకంగా ఈ సమ్మేళనానికి వచ్చారు. ఈ సందర్భంగా నాటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె శివరామకృష్ణ మాట్లాడుతూ... వివిధ దేశాలలో స్థిరపడిన వారు కూడా ఈ కార్యక్రమానికి రావడం అభినందనీయమన్నారు. పూర్వ విద్యార్థులు చేపట్టే ప్రగతి కార్యక్రమాలకు మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శైలేంద్ర, పూర్వ విద్యార్థుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.