calender_icon.png 6 July, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరసింహ రెడ్డి కళాశాలలో అద్దాలు, పూలకుండీలు ధ్వంసం

05-07-2025 07:27:54 PM

మేడ్చల్ (విజయక్రాంతి): మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల(Narsimha Reddy Engineering College)లో ఎన్ఎస్యుఐ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. విద్యార్థుల హాజరులేదని అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా అద్దాలు, పూల కుండీలు ధ్వంసం చేశారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్దిసేపు కళాశాలలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. యాజమాన్యం పేటిబషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి ఎన్ఎస్యుఐ కార్యకర్తలను కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ నరసింహారెడ్డి మాట్లాడుతూ... తాము అధిక ఫీజులు వసూలు చేయడం లేదని తెలిపారు. శాంతియుతంగా ఆందోళన చేసుకోవాలి గాని అద్దాలు, పూల కుండీలు ధ్వంసం చేయడం సరైనది కాదన్నారు.